ఇజ్రాయెల్​ కు ఆయుధాల ఎగుమతులు నిలిపేయాలి

సుప్రీంలో పిటిషన్​ దాఖలు

Sep 4, 2024 - 17:56
 0
ఇజ్రాయెల్​ కు ఆయుధాల ఎగుమతులు నిలిపేయాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇజ్రాయెల్​ కు ఆయుధాలు, సైనిక పరికరాల ఎగుమతులను వెంటనే నిలిపివేయాలని బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఈ పిటిషన్​ ను సీనియర్ లాయర్లు ప్రశాంత్ భూషణ్, హర్ష్ మాందర్, జీన్ డ్రేజ్, నిఖిల్ డే సహా 11 మంది ఈ పిల్ దాఖలు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలు సహా అనేక ఇతర కంపెనీలు ఇజ్రాయెల్‌కు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయన్నారు. ఇది రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్స్‌తో పాటు అంతర్జాతీయ చట్టం ప్రకారం భారత్​ బాధ్యతలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. అందుకే వెంటనే ఆయుధాల ఎగుమతులను నిలిపివేయాలని సుప్రీం ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్​ లో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖను పార్టీగా చేర్చారు. ఐసీజే నిర్ణయాన్ని, ఒప్పందాలను కూడా పిటిషన్​ లో పేర్కొన్నారు.