కాంగ్రెస్ వి అసందర్భ వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర మండిపాటు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి, కాంగ్రెస్ పార్టీ నేతల అసందర్భ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని దహన సంస్కారాలపై ట్వీట్ లు చేయడం, అసందర్భ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమన్నారు. డా. మన్మోహన్ సింగ్ గొప్ప స్థాయి వ్యక్తి. కాబట్టే క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ రోజు ప్రపంచం మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడుతుందని, నెమరువేసుకుంటుందన్నారు. కాబట్టే ఆయనకు సముచిత గౌరవం ఇచ్చామన్నారు. మరీ కాంగ్రెస్ హయాంలో ప్రణబ్ ముఖర్జీ, పీవీ నరసింహరావులకు ఏం గౌరవం ఇచ్చారో? చెప్పాలని సంబిత్ పాత్ర నిలదీశారు. ప్రధాని మోదీ బీజేపీ పార్టీలకతీతంగా నాయకులకు గౌరవం ఇచ్చిందన్నారు.