అమరజవాన్ల కుటుంబాలకు ఎక్స్​ గ్రేషియా పెంపు

Increase in ex gratia for the families of Amarajwans

Dec 28, 2024 - 18:04
 0
అమరజవాన్ల కుటుంబాలకు ఎక్స్​ గ్రేషియా పెంపు

రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి
హరియాణా కేబినెట్​ నిర్ణయం
వివరాలు వెల్లడించిన సీఎం నాయాబ్​ సింగ్​ సైనీ

చండీగఢ్​: అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్​ గ్రేషియాను రూ. 1 కోటికి పెంచాలని హరియాణా కేబినెట్​ నిర్ణయించింది. కేబినెట్​ సమావేశం అనంతరం హరియాణా సీఎం నాయాబ్​ సింగ్​ సైనీ మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వివరించారు.  శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ డిమాండ్​ ఆర్మీ జవాన్లు, కుటుంబాల నుంచి ఉందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం సైనికుల డిమాండ్​ పై సానుకూల నిర్ణయాన్ని తీసుకుందన్నారు. అలాగే 1957 నాటి మాతృభాష హిందీ ఉద్యమం సత్యాగ్రహీలకు నెలవారీ పెన్షన్​ ను రూ. 15వేల నుంచి రూ. 20వేలకు పెంచామన్నారు. సమావేశానికి ముందు మాజీ ప్రధాని డా. మన్మోహన్​ సింగ్​ కు నివాళులర్పించారు. 31 అజెండాల్లో 30ని ఆమోదించామని1 నిర్ణయాన్ని వాయిదా వేశామని మిగతా నిర్ణయాలపై సమీక్షించి తీసుకుంటామని సీఎం నాయాబ్​ సింగ్ సైనీ వివరించారు.