దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం 179మంది మృతి
179 killed in South Korea plane crash
రన్ వేపై జారీ గోఢను ఢీకొట్టి పేలిన బోయింగ్
ల్యాండింగ్ గేర్, బ్రేకుల విఫలమే కారణం?
ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
సియోల్: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానం ప్రయాణిస్తున్న 181 మందిలో 179 మంది మృతిచెందారు. ఆదివారం ఉదయం బ్యాంకాక్ నుంచి బెజు ఎయిర్ విమానం (అమెరికాకు చెందిన బోయింగ్ 737800) దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమాశ్రయంలో రన్ వేను దాటి గోడను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా విమానంలో భారీ పేలుడు సంభవించింది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ గంటపాటు శ్రమించి విమానంలోని మంటలు పూర్తిగా అదుపు చేయగలిగారు. విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు.
విమానాశ్రయంలో ల్యాండింగ్ కు ముందే గాలిలో ఉండగా విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగినట్లు కనపడ్డాయి. అనంతరం విమానం రన్ పై ల్యాండింగ్ కు దిగే సమయంలో గేర్ లో లోపం, బ్రేకులు పడకపోవడం లాంటి సాంకేతిక కారణాలు తలెత్తి ఉండవచ్చని అధికారులు వివరించారు. దీంతో విమానం రన్ వేపై క్రాష్ ల్యాండింగ్ అయ్యిందన్నారు. ఉదయం 9.07 గంటలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు. దీంతో ఈ విమానాశ్రయంలోని అన్ని విమానరాకపోకలను నిలిపివేశామన్నారు.
ప్రమాదం అనంతరం పెద్ద యెత్తన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను విమానం నుంచి బయటికి తీశారు. ఈ విమానంలో 173 మంది దక్షిణ కొరియా జాతీయులకు తెలిపారు. ఇద్దరు థాయ్ పౌరులున్నారని తెలిపారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఏవియేషన్ అధికారులు మీడియాకు వివరించారు.