9 జిల్లాలు, 3 డివిజన్లు రద్దు
రాజస్థాన్ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
జైపూర్: రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజస్థాన్ కేబినెట్ సమావేశంలో 9 జిల్లాలను రద్దు చేయాలని నిర్ణయించారు. సీఎం భజన్ లాల్ అధ్యక్షతన శనివారం రాజస్థాన్ మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. గెహ్లాట్ ప్రభుత్వంలో 17 కొత్త జిల్లాలు, మూడు కొత్త డివిజన్లను ప్రకటించారు. ప్రవర్తనా నియమావళికి ముందు కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు సరైంది కాదని సీఎం భజన్ లాల్ శర్మ ప్రభుత్వం భావించి కేబినెట్ లో రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం రాజస్థాన్ లో 41 జిల్లాలు, ఏడు డివిజన్లు ఉన్నాయి. దీంతోపాటు ఆహార భద్రత పథకంలో లబ్ధిదారులను చేర్చాలని నిర్ణయించారు. సీఈటీ (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష మార్కులపై కూడా నిర్ణయం తీసుకున్నారు. కాగా జిల్లాల రద్దు నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జూలై 1న ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి నూతన జిల్లాలు, డివిజన్ అంశాలపై సమీక్షించి నివేదిక సమర్పించాలని కోరింది.