ఆలయ ప్రహారీ గోడ కూలి 9మంది పిల్లల మృతి

9 children died after the wall of the temple collapsed

Aug 4, 2024 - 13:41
 0
ఆలయ ప్రహారీ గోడ కూలి 9మంది పిల్లల మృతి

భోపాల్​: మధ్యప్రదేశ్​ లో ఆలయం గోడ కూలి 9మంది చిన్నారులు మృతి చెందారు. రహ్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని  సనౌధా పోలీస్​ స్టేషన్​ పరిధి షాపూర్​ హర్దౌల్​ శివాలయంలో ఈ ప్రమాదం ఆదివారం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా కన్నీటి సంద్రంగా మారింది. ఈ ప్రహారీ గోడ 50యేళ్ల క్రితం నాటిదని స్థానికులు చెబుతున్నారు. మృతుల వయసు 9 నుంచి 19యేళ్ల మధ్య ఉంటుందన్నారు. నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఆదివారం ఉదయం ఆలయంలో గ్రామస్థుల పిల్లలంతా కలిసి మట్టితో కూడిన శివలింగాని ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. పురాతన గోడ పక్కనే వీరంతా ఏర్పాట్లలో ఉండడంతో ఒక్కసారిగా గోడ కూలి పిల్లలపై పడిందని స్థానికులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక కలెక్టర్​, ఎమ్మెల్యేలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.