అమెరికాకు కిమ్ సోదరి వార్నింగ్!
Kim's sister warning to America!

ప్యాంగాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. దక్షిణ కొరియాలో అమెరికా విమాన నౌక, సైనిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించి వేడి పుట్టించింది. ఈమె ప్రకటన కిమ్ జోంగ్ ఉన్ ను తలపిస్తుందని ప్రపంచ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. కాగా కిమ్ ఎక్కడకు వెళ్లారనే సమాచారం ఎవ్వరికీ లేకపోవడంతో కిమ్ సోదరి యో జోంగ్ తాత్కాలిక అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఈమె చేసిన వ్యాఖ్యలతో ఉత్తరకొరియా–అమెరికాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. ఈమె అమెరికాను హెచ్చరించిన తీరు చూస్తుంటే అణ్వాయుధ కార్యకలాపాలలో మరింత వేగవంతం చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా ఉత్తరకొరియాతో మాట్లాడి దౌత్యాన్ని పునరుద్ధరిస్తానని ట్రంప్ చెప్పడం కొసమెరుపు.