ఆప్ లో లుకలుకలు
పార్టీని వీడుతున్న స్థానిక నాయకులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ స్థానిక నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం పలువురు స్థానిక కౌన్సిలర్లు, సీనియర్ ఆప్ నాయకులు బీజేపీలో చేరారు. పార్టీలో అంతర్గత విబేధాలు కూడా తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పార్టీని వీడక తప్పలేదని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. పార్టీలో కేజ్రీవాల్, అతిసి, సిసోడియాల ఒంటెద్దు పోకడలతో విసిగిపోయామని అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. బీజేపీలో చేరిన వారిలో న్యూ ఢిల్లీ మాజీ జిల్లా అధ్యక్షుడు సందీప్ బసోయా, సిట్టింగ్ కౌన్సిలర్లు అనితా బసోయా, నిఖిల్ చప్రానా, ధరమ్ వీర్ లు ఆప్ ను వీడారు.