కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య
Chandra Arya in the race for Prime Minister of Canada
కేంద్రమంత్రి ఎస్. జై శంకర్ హర్షం
కర్ణాటక భారత సంతతి వ్యక్తి
గతంలో మోదీతోనూ భేటీ
ఇరుదేశాల బంధాలపై చర్చ
ఒట్టావా: కెనడా ప్రధాని అభ్యర్థిత్వానికి భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈయన కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందినవారు. కెనడా వెళ్ళేముందు ధార్వాడ్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఇందిరాగాంధీ హత్య సమయంలో కెనడాలో హిందూ దేవాలయాల విధ్వంసాలను తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనలు కూడా చేపట్టారు. ఆయన ధైర్యాన్ని మెచ్చుకున్న పలువురు రాజకీయాల్లోకి ఆహ్వానించడంతో ఆయన రాజకీయాల వైపు మళ్లారు. సురక్షితమైన, సమర్థవంతమైన భవిష్యత్ ను పునర్నిర్మించేందుకు ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తున్నానని ఆర్య ప్రకటించారు. చంద్ర ఆర్య పోటీ పట్ల భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. లిబరల్ పార్టీ తరఫున ఆర్య గెలిస్తే భారత్–కెనడాల మధ్య నిర్ణయాలు మరింత బలోపేతం అవుతాయని, ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటామని జై శంకర్ ప్రకటించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆర్య అనేక అంశాలపై చర్చించారు. భారత్–కెనడాల మధ్య సంబంధాల బలోపేతం, ప్రాముఖ్యతను వివరించారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా నిర్ణయం అనంతరం నూతన ప్రధాని ఎన్నికయ్యే వరకు తాను తాత్కాలిక ప్రధానిగా సేవలందించనున్నానని ప్రకటించారు.