చండీగఢ్ మేయర్ స్థానం బీజేపీ కైవసం
ఆప్, కాంగ్రెస్ జతకట్టిన ఓటమి తప్పలే
చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లో మేయర్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. బీజేపీకి చెందిన హర్ ప్రీత్ కౌర్ బబ్లా మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు. గురువారం మేయర్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ అభ్యర్థికి 19 ఓట్లు రాగా, ఆప్, కాంగ్రెస్ లకు కలిపి 17 ఓట్లు మాత్రమో పోలయ్యాయి. బీజేపీ 16 మంది కౌన్సిలర్లు ఉండగా19 ఓట్లు రావడంపై క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైంది. ఆప్ 13, కాంగ్రెస్ కు 7 కౌన్సిలర్లున్నారు. ఎంపీ మనీష్ తివారీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కూటమిగా పోటీ పడ్డాయి.
గత ఎన్నికల వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని చండీగఢ్ మేయర్ ఎన్నికకు స్వతంత్ర పరిశీలకురాలిగా పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి (రిటైర్డ్) జయశ్రీ ఠాకూర్‌ను సుప్రీంకోర్టు నియమించింది. మేయర్ ఎన్నికల ప్రక్రియను పరిశీలకుల సమక్షంలో నిర్వహించాలని కోర్టు కోరింది. ఎన్నికల ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ ద్వారా చేపట్టాలని సూచించింది.