బాపూ ఆదర్శరాలు సదా స్మరణీయం
వర్థంతి సందర్భంగా రాష్ర్టపతి, ప్రధాని నివాళులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మహాత్మాగాంధీ ఆదర్శాలు దేశ నిర్మాణంలో మనందరినీ ప్రేరేపిస్తాయని, ఆయన త్యాగం ఎనలేనిదని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా న్యూ ఢిల్లీలోని రాజ్ ఘాట్ గాంధీ స్మృతి స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. బాపూ అపారమైన కృషి, సత్యం, అహింస, తిరుగులేని నిబద్ధతను కొనియాడారు. బాపూ సేవ, త్యాగాలు సదా స్మరణీయమే అని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని తోపాటు మహాత్మాగాంధీకి నివాళులర్పించిన వారిలో ఉపాధ్యక్షడు జగదీప్ ధంఖర్, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా తదితరులున్నారు.