మరింత పైపైకి పసిడి!
More upside gold!
తొలిసారిగా రూ. 8వేల మార్కు దాటిన గ్రాము ధర
పెళ్లిళ్ల సీజన్ లో లక్ష వరకు పెరిగే అవకాశం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: పసిడి ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతుంది. 2024 జనవరి 2025 జనవరి చివరి నాటికి రూ. 13 వరకు ధరలు పెరిగాయి. రానున్నది పెళ్లి సీజన్ కావడంతో లక్ష పై చిలుకు చేరుకునే అవకాశం ఉంది. ముందుజాగ్రత్తగా బంగారం కొంటుండడంతోనే డిమాండ్ పెరిగిందనే వాదనలూ వినబడుతున్నాయి. ప్రస్తుతం మెట్రో నగరాల్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 81 వేల నుంచి రూ. 84వేల వరకు కొనసాగుతున్నాయి. గత 30 రోజుల్లోనే బంగారం ధర రూ. 4,844 పెరిగింది. వెండి రూ. 920 పెరిగి కిలోకు రూ. 91,600కు చేరుకుంది. తొలిసారిగా పసిడి 80వేల మార్కును దాటి పరుగులు తీస్తూ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ. 76,250, 24 క్యారెట్లు రూ. 83,170. ముంబైలో 10 గ్రాములు రూ.76,100 కాగా, 24 24 క్యారెట్ల బంగారం ధర రూ.83,020గా ఉంది. కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.76,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.83,020గా కొనసాగుతుంది. చెన్నైలో 10 గ్రాములు రూ.76,100, 24 క్యారెలు రూ.83,020గా ఉంది. భోపాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 76,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,070గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 76,710 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 83,020గా కొనసాగుతుంది.
ట్రంప్ ఎన్నిక కూడా కారణమే..
పసిడి ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరగడానికి అమెరికా అధ్యక్షుడి ఎన్నికే కారణమనే వాదనలున్నాయి. అమెరికా ఇటీవలే వడ్డీ రేట్లు తగ్గించింది. మరింత తగ్గించే అవకాశం ఉంది. దీంతో డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ బలహీన పడి బంగారం ధర పెరుగుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరో కారణంగా నిలుస్తుండగా, రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇప్పటి నుంచే బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్ లలో పిడి ఈటీఎఫ్ లపై పెట్టుబడుల్లో కూడా వృద్ధి నమోదవుతుంది. ఏది ఏమైనా భారతీయులు నచ్చే, మెచ్చే, వేసుకొని గొప్పలకే పోయే బంగారం కాస్త రానున్న సమయంలో పట్టుకుందామంటే, ముట్టుకుందామంటే కూడా బంగారమే అయ్యేటట్లుంది.