తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
2047 అభివృద్ధిలో పాలుపంచుకోవాలి
దేశ దశ, దిశ నిర్దేశించాలి
కేంద్రీయ విద్యాలయ రాష్ట్రీయ ఏక్తా పర్వ్ 2024లో కేంద్రమంత్రి
నా తెలంగాణ, హైదరాబాద్: కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు చదువుల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుంటారని, రాబోయే సమయంలో 2047 ప్రధాని మోదీ విజన్ కు మార్గదర్శకులుగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ సంస్థలో చదివిన విద్యార్థులంతా భారత్ కు దశ, దిశ నిర్దేశకులుగా నిలిచి దేశాన్ని అభివృద్ధి బాటలో ముందుంచేందుకు పనిచేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. భారత్ లో నిరుద్యోగం, పేదరికం ఇంకా ఉందన్నారు. దీన్ని తరిమికొట్టేందుకు 2047 మోదీ ప్రభుత్వం అభివృద్ధి విజన్ ను ఎన్నుకుందని తమ ప్రభుత్వం ఇదే దిశలో పనిచేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
సోమవారం సికింద్రాబాద్ తిరుమలగిరిలోని కేంద్రీయ విద్యాలయ రాష్ట్రీయ ఏక్తా పర్వ్ 2024 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.
యువశక్తితో అద్భుతాలు సృష్టిద్దాం..
ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం భారత్ అన్నారు. యువశక్తిని వినియోగించుకొని భారత్ విజన్ ను రూపొందించిందన్నారు. ఈ యువశక్తి అద్భుతాలు సృష్టిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతీఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజలందరి ముందు విజన్, ఛాలెంజ్, టార్గెట్ లను ఉంచారన్నారు. వాటిని పూర్తి చేయడంలో మనందరి సహకారం ఉండాలని మంత్రి పేర్కొన్నారు. అప్పుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. వ్యవసాయం, వ్యవసాయం, వ్యాపారం, వాణిజ్యం, సాంకేతికం, విద్య, వైద్యం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి 140 కోట్ల భారతీయుల సత్తాను ప్రపంచంలో చాటేందుకు సిద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అభివృద్ధే ఏజెండాగా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
విశ్వగురుగా భారత్ ను రూపుదిద్దుదాం..
తాను సాంస్కృతిక మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రీయ విద్యార్థుల ప్రతిభను చూశానని తెలిపారు. ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఎందుకు తక్కువ కాదన్నారు. ఓ వైపు చదువుతోపాటు, మరోవైపు కళలు, సాంకేతికత, పోటీ రంగాలకు ధీటైన విద్యార్థులు ఇక్కడ రూపుదిద్దుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. వీరి నేతృత్వంలో భారత్ విశ్వగురుగా అవతరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు, అధికారులు తదితరులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
భాగ్యనగరం అభివృద్ధిని చూడాలని దేశంలో ప్రతీనగరం, గ్రామం, పట్టణం అన్ని ప్రాంతాలను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లడాలనే త ముఖ్యోద్దేశ్యమన్నారు. మోదీ నేతృత్వంలో ఇందుకు ప్రతీఒక్కరి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.