నన్ను ఆశీర్వదించండి మోదీని గెలిపించండి

పోలింగ్​ శాతం పెరగాలి: కిషన్​ రెడ్డి

May 8, 2024 - 17:00
 0
నన్ను ఆశీర్వదించండి మోదీని గెలిపించండి
  • దేశం కోసం బీజేపీకి ఓటు వేయండి
  • కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలకు ఓటు వేయడం వృథా
  • నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి ప్రచారం
  • మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు
  • బైక్​ ర్యాలీకి భారీగా తరలివచ్చిన యువత

నా తెలంగాణ, హైదరాబాద్​:

ఈ నెల13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్​ శాతాన్ని పెంచాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్​ ఎంపీగా తనను ఆశీర్వదించాలని, మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం నాంపల్లి నియోజకవర్గంలో కిషన్​ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జైన్ మందిర్ తాళ్లగడ్డ వద్ద ప్రారంభమైన ప్రచార యాత్ర.. శారద నగర్, నవోదయ కాలనీ హుడా కాలనీ శ్రీరామ్ నగర్, రేతిబౌలి, మిలాన్ టాకీస్, కుమ్మరవాడి మీదుగా ఇందిరానగర్, బోయగూడా, కమాన్ బజార్ ఘాట్, గోకుల్ నగర్, గోల్కొండ హోటల్, పెన్షన్ ఆఫీస్, శ్రీరామ్ టెంపుల్, హైమద్ నగర్ లో కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు కిషన్​ రెడ్డికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. యువత పెద్ద ఎత్తున తరలివచ్చి బైక్​ ర్యాలీ నిర్వహించారు. 

మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమే..

అనంతరం కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత పదేండ్లు బీఆర్​ఎస్​ దోచుకుంటే.. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ‘‘దేశం కోసం, మీ పిల్లల భవిష్యత్​ కోసం బీజేపీకి ఓటు వేయండి. మోదీని మరోసారి ప్రధానిని చేద్దాం. సికింద్రాబాద్​ ఎంపీగా నేను చేసిన అభివృద్ధి మీ ముందు పెట్టాను. నన్ను ఎంపీగా మరోసారి ఆశీర్వదించండి. నియోజకవర్గ అభివృద్ధిగా కృషి చేస్తాను. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలకు ఓటు వేసినా వృథానే. ఎందుకంటే కేంద్రంలో మళ్లీ వచ్చిది మోదీ ప్రభుత్వమే”అని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. ​