యూపీలో మరో ఎన్​ కౌంటర్​  నలుగురు మృతి

Four killed in another encounter in UP

Jan 21, 2025 - 17:31
 0
యూపీలో మరో ఎన్​ కౌంటర్​  నలుగురు మృతి

ఇన్​ స్పెక్టర్​ కు గాయాలు

లక్నో: యూపీ షామ్లీలో భారీ ఎన్​ కౌంటర్​ జరిగింది. నలుగురు నేరస్థులను పోలీసులు ఎన్​ కౌంటర్​ చేశారు. ఈ ఎన్​ కౌంటర్​ లో ఓ ఇన్​ స్పెక్టర్​ కు కూడా గాయాలయ్యాయి. ఈ ఎన్​ కౌంటర్​ లో లక్ష రివార్డు ఉన్న అర్షద్​, ముస్తఫా, మంజీత్​, సతీష్​ లు మృతి చెందారు. షామ్లీలోని ఉద్పూర్​ ఇటుకబట్టి వద్ద ఈ ఎన్​ కౌంటర్​ చోటు చేసుకుంది. ఉద్పూర్​ గ్రామంలో నేరస్థుల కారును ఎస్టీఎఫ్​ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో హఠాత్తుగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇన్ స్పెక్టర్​ సునీల్​ కుమార్​ కు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దీంతో నలుగురు నేరస్థులు మృతి చెందారు. షామ్లీలోని ఒక ప్రాంతంలో దుండగులు దోపిడీ ఉద్దేశ్యంతో కారులో వెళుతున్నట్లు ఎస్టీఎఫ్​ కు సమాచారం అందింది. ఈ నేరస్థులు కగ్గ గ్యాంగ్​ అనే పేరుతో ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని కిడ్నాప్​ లు, బెదిరింపులు, దోపిడీలు, హత్యలు లాంటి నేరాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఈ ముఠాపై ఇప్పటికే 17 క్రిమినల్​ కేసులు నమోదయ్యాయయని తెలిపారు. ఎన్​ కౌంటర్​ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్పీ రామ్​ సేవక్​ గౌతమ్​ ఘటనా స్థలానికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడ్డ పోలీసు అధికారిని ఆసుపత్రికి తరలించారు.