పనామా ట్రంప్ వ్యాఖ్యలపై జోస్ రౌల్ మండిపాటు
Jose Raul's anger over Panama Trump's comments
పనామా సిటీ: పనామా కెనాల నియంత్రణపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనాల్ లో బయటిదేశం జోక్యం చేసుకోవద్దన్నారు. ట్రంప్ వ్యాఖ్యల అనంతరం మంగళవారం రౌల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన వాణిజ్యం 40 శాతం ఈ మార్గం ద్వారానే జరగుతుందన్నారు. ఈ మార్గం తమ దేశం చేతుల్లో ఉంటుందని ములినో పేర్కొన్నారు. తాము ఏ దేశ పరిపాలనలోనూ జోక్యం చేసుకోలేదని తమ దేశ అంతర్గత నిర్ణయాల్లో కూడా అమెరికా ట్రంప్ జోక్యం చేసుకోవద్దన్నారు. అమెరికాకు చెందిన అనేక షిప్ లు అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఉన్న ఈ మార్గం ద్వారానే వెళతాయన్నారు.
డోనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ పై మాట్లాడుతూ.. కెనాల్ ను నిర్వహించే బాధ్యత ఆ దేశానికిస్తే ఇప్పుడు ఆ దేశం చైనాకు దాన్ని అప్పజెప్పిందన్నారు. తమ దేశ కార్గోషిప్ లకు అధిక ఛార్జీలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పనామాకు ఆ దేశానికి అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామన్నారు. వెంటనే ఛార్జీలను తగ్గించాలని, లేకుంటే కెనాల్ నిర్వహణను తమకు అప్పజెప్పాలని ట్రంప్ అన్నారు.