అవినీతిపరుల జాబితా కోరిన సీఎం యోగి!

అధికారులకు ముచ్చెమటలు యోగి మార్క్​ పాలనకు బుల్డోజర్​ ప్రభుత్వం రెఢీ

Nov 9, 2024 - 12:29
 0
అవినీతిపరుల జాబితా కోరిన సీఎం యోగి!

లక్నో: యోగి మార్కు పాలనలో అవినీతిపరులైన అధికారుల చూపించనున్నారు. అన్ని విభాగాల్లో అత్యంత అవినీతికి పాల్పడే, ప్రజా సమస్యల పరిష్కారాలను నిర్లక్ష్యం చేసే, పనులను, లక్ష్యాలను సరిగ్గా నిర్వహించని అధికారుల జాబితాను సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో శనివారం రాష్​ర్టంలోని అన్ని జిల్లాల జోనల్​ కమిషనర్లను జాబితా కోరుతూ నోటీసులు జారీ చేసింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వీరిందరిపై యోగి ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే యూపీలో బుల్‌డోజర్​ మార్క్​ పాలనతో రౌడీయిజాన్ని తరిమికొట్టిన సీఎం యోగి ప్రస్తుతం అవినీతి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనే అనే చర్చ జరుగుతోంది. సీఎం ఏది చేసినా సమాజానికి మేలు జరిగే పనే చేస్తాడని ప్రజలు భావిస్తున్నా, పనులు చేయని, అవినీతి అధికారులకు మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయి. 

ప్రతీ జిల్లాలోని ఒక మొబైల్ టీమ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్​ఐబీ)లో ఒక్కో అవినీతి అధికారి పేర్లను కోరింది. ఈ బృందాలు వెంటనే తమ పనిని మొదలుపెట్టాలని సీఎం పేరుతో నోటీసులు జారీ అయ్యాయి.