క్యాన్సర్ నివారణకు సీఎఆర్– టీ థెరపీ
అధ్యక్షురాలు ద్రౌపదీ ముర్మూ
బాంబే: క్యాన్సర్ చివరి దశలో నిర్ధారణ వల్ల ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని, క్యాన్సర్ నివారణలో సీఎఆర్– టీ థెరపీ ఉపయోగపడుతుందని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. గురువారం ఐఐటీ బాంబే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం సీఏఆర్–టీ థెరపీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముర్మూ మాట్లాడుతూ.. ఐఐటీ ముంబై, టాటా మెమోరియల్‌లు అభివృద్ధి చేసిన ఈ జన్యు ఆధారిత చికిత్స క్యాన్సర్‌ను నయం చేయడంలో సహాయపడుతుందన్నారు. 2019లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 9.3 లక్షల మరణాలు నమోదైవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ చికిత్స అధిక ధరల కారణంగా సాధారణ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నూతన థెరపీ వల్ల తక్కువ ధరల్లోనే సులభతరమైన వైద్యం సాధారణ ప్రజలకు అందించడం అభినందనీయమని రాష్ర్టపతి ముర్మూ పేర్కొన్నారు.