సైన్యాన్ని అవమానిస్తే ఉరకునేది లేదు

అవినీతిలో కాంగ్రెస్​, ఆప్​ కు పీహెచ్​ డీలు కర్తార్​ పూర్​ హక్కులను వదిలేసుకున్నారు పంజాబ్​ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ

May 30, 2024 - 13:21
 0
సైన్యాన్ని అవమానిస్తే ఉరకునేది లేదు

చండీగఢ్​: దేశ సైనికుల అవసరాలను కూడా పట్టించుకోలేదని కాంగ్రెస్​ పై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. వన్ ర్యాంక్​ వన్​ పెన్షన్​ పై 40 ఏళ్లుగా అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. పంజాబ్​, హిమాచల్​ లు మాజీ సైనికుల పుణ్యభూములన్నారు. సైన్యాన్ని అవమానిస్తే మోదీ చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. ఆప్​ పార్టీ పంజాబ్​ ను స్వర్ణమయంగా మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి డ్రగ్స్​ వ్యాపారాలు చేస్తున్నారని, మైనింగ్​ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
గురువారం పంజాబ్​ లోని హోషియార్​ పూర్​ లో ప్రధాని ఏడో విడత ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రసంగించారు. పంజాబ్​ లోని 13 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోనున్నామని స్పష్టం చేశారు. ఆప్​ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పంజాబ్​ లో గ్యాంగ్​ వార్​ లు పెరిగిపోయాయన్నారు. పరిశ్రమలు, వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి విధానాల వల్ల పంజాబ్​ లో అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయన్నారు. పంజాబ్​ పుణ్యభూమి అన్నారు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి సాక్ష్యాధారాలను కూడా ఈ రెండు పార్టీలు అడగడం వీరి దేశ విచ్ఛిన్న ఆలోచనలన్నారు. భారత్​ ను బలహీనపర్చే ఏ ఆలోచనలు వారు వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు. 

అవినీతిలో కాంగ్రెస్​, ఆప్​ లు పీహెచ్​ డీలు సాధించాయన్నారు. దేశ విభజన సమయంలో కర్తార్​ పూర్​ సాహిబ్​ పై కూడా కాంగ్రెస్​ హక్కులను వదులుకుందని మండిపడ్డారు. ప్రస్తుతం రామ మందిరంపై కూడా అలాంటి దురాలోచనలతోనే ఉందన్నారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసే వ్యక్తులు వీరేనని ప్రధాని మోదీ మండిపడ్డారు.