2026నాటికి బుల్లెట్​ రైలు అహ్మదాబాద్​–ముంబై మధ్య సర్వీసు

అహ్మదాబాద్-ముంబై మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Mar 19, 2024 - 20:00
 0
2026నాటికి బుల్లెట్​ రైలు అహ్మదాబాద్​–ముంబై మధ్య సర్వీసు

నా తెలంగాణ, ఢిల్లీ: అహ్మదాబాద్-ముంబై మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ‘రైజింగ్ భారత్ సమ్మిట్‌’లో పాల్గొన్న మంత్రి పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం పొడవు 508 కిలోమీటర్లు ఉండనుందని తెలిపారు. 2028లో పూర్తిస్థాయిలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ మార్గంలోని పట్టణాలు, నగరాల రూపురేఖలు మారిపోతాయని అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు. థానే నుంచి ముంబై చేరుకునేందుకు ఈ మార్గం సముద్ర సొరంగం గుండా కొనసాగడం విశేషం. ఈ మేరకు పనులు ప్రారంభమైనట్లు మంత్రి వివరించారు.