అణు బెదిరింపులపై తలొగ్గం
ఇరాన్ సుప్రీం ఖమేనీ

టెహ్రాన్: ఇరాన్ అణు కార్యక్రమాలపై బెదిరింపులు, హెచ్చరికలకు తలొగ్గిది లేదని ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చెప్పారు. తమ దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. తాము ఎవరినీ బెదిరించేందుకు తమ అణు సామర్థ్యాన్ని పెంచుకోవడం లేదన్నారు. తమదేశ రక్షణ కోసమే అణు సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్న ఉద్దేశ్యంతో ముందుకు వెళుతున్నట్లు ఖమేనీ అమెరికా ట్రంప్ పేరెత్తకుండానే ప్రకటించారు. ఇరాన్ సీనియర్ అధికారులతో ఆదివారం ఖమేనీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బెదిరింపులు అంటే సమస్యలు పరిష్కరించుకోవడం కాదన్నారు. ఇరాన్ తమ భద్రతకు కట్టుబడి ఉందన్నారు. అదే సమయంలో అణు సామర్థ్యం పై ఎలాంటి అంగీకారాలు, ఒప్పందాలను ఒప్పుకోదన్నారు. ట్రంప్ 2017–21లో ఇరాన్ అణు కార్యకలాపాలపై పరిమితులను విధించారు. 2018లో ఆయన వైదొలిగిన తరువాత ఆంక్షలను ఉల్లంఘించి ఇరాన్ అణు సామర్థ్యాన్ని సాధించుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
కాగా టెహ్రాన్ తమ ప్రయోజనాలకనే చెబుతున్నా.. ఇప్పటికే హిజ్భుల్లా లాంటి ఉగ్రసంస్థలను పెంచి పోషిస్తూ పలు దేశాలకు పంపుతూ దాడులకు ఉసిగొల్పుతూ వారికి ఆయుధాలను అంజేస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచశాంతికి భంగం వాటిల్లేలా చేస్తున్నాయి. ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ రెచ్చగొట్టిన ఉగ్రముఠాలే కారణం. ఫలితంగా మూడు దేశాల్లో తీవ్ర విధ్వంసం తప్పలేదు. ఈ నేపథ్యంలో అణు సామర్థ్యం ఇరాన్ సాధిస్తే ఉగ్రవాదుల చేతికి వెళ్లదన్న గ్యారంటీ లేదు. దీంతో ప్రపంచదేశాలన్నీ ముప్పుముంగిట్లో పడ్డట్టే. అందుకే అమెరికా ఇరాన్ అణు సామర్థ్యంపై తీవ్రంగా ఆంక్షలు విధించడం, వ్యతిరేకించడం చేస్తుంది.