హిజ్బుల్లా స్థావరాలపై ఐడీఎఫ్​ దాడులు

IDF attacks on Hezbollah bases

Mar 14, 2025 - 18:06
Mar 14, 2025 - 18:06
 0
హిజ్బుల్లా స్థావరాలపై ఐడీఎఫ్​ దాడులు

బీరుట్​: లెబనాన్​ లోని బెకాపై ఇజ్రాయెల్​ శుక్రవారం భీకర వైమానిక దాడులకు పాల్పడింది. బీరుట్​ లోని తూర్పు పర్వత శ్రేణి లెబనాన్‌లోని బెకాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. తూర్పు పర్వత శ్రేణిలోని కౌసాయా, అల్​ షారా, జాంతా గ్రామాలనే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడింది. కాగా ఈ ప్రాంతాల్లో హిజ్భుల్లా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ఐడీఎఫ్​ గుర్తించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. వీరి కార్యకలాపాలు మరోసారి ఇజ్రాయెల్​ కు ప్రమాదకరంగా మారే అవకాశం ఉండడంతోనే దాడులకు పాల్పడినట్లు ఐడీఎఫ్​ ప్రకటించింది. కాగా పలువురి ఇజ్రాయెల్​ బందీలు ఇంకా హమాస్​ చేతిలో బందీలుగా ఉన్నారు. బందీలను రెండోదశ విడుదల చేయాలని ఇజ్రాయెల్​ తోపాటు అమెరికా కూడా హమాస్​ కు హెచ్చరికలు జారీ చేసినా వారు పెడచెవిన పెడతుండడంతోనే ఐడీఎఫ్​ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం.