ఐసీస్​ ఉగ్రవాది అబూ ఖదీజా మృతి

ISIS terrorist Abu Khadija dies

Mar 15, 2025 - 11:37
 0
ఐసీస్​ ఉగ్రవాది అబూ ఖదీజా మృతి

బాగ్దాద్​: ఇరాక్​ లోని ఐసీస్​ ప్రముఖ ఉగ్రవాది, ప్రపంచంలోని ఈ గ్రూప్​ దాడులకు ప్రణాళికలు, ఆర్థిక సహాయాన్ని అందజేసే అబూ ఖదీజా హతమయ్యాడని ఇరాక్​ ప్రభుత్వం ప్రకటించింది. ఇతన్ని అమెరికా సహాయంతో మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ఇతని మృతి ఐసీస్​ కు పెద్ద దెబ్బగా ఇరాక్​ ప్రధాని అల్​ సుడానీ ప్రశంసించారు. శుక్రవారం అర్థరాత్రి అమెరికా దళాల సహాయంతో ఇతన్ని సమాచారాన్ని కనుగొన్న ఇంటలిజెన్స్​ బాగ్దాద్​ శివారులోని క్యాంప్​ పై వైమానిక దాడులు చేశారు. ఈ దాడుల్లో అబూ ఖాదీజాతోపాటు మరింతమంది మృతి చెందారని ప్రకటించారు. కాగా ఇతను మృతి చెందాడని డీఎన్​ ఎ పరీక్ష ద్వారా నిర్ధరించుకున్నట్లు ఇరాక్​ ప్రకటించింది. ఖదీజా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులలో ఒకరని ఇరాక్​ పేర్కొంది. ఐసీస్​ స్వాధీనం చేసుకున్న తమ భూభాగాలను ఒక్కొక్కటిగా ఇరాక్​ అమెరికా సంకీర్ణ దళాల సహాయంతో తిరిగి పొందుతుంది. ఇందులో భాగంగానే ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. సిరియాలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, అంతర్యుద్ధం వల్ల ఇరాక్​ సరిహద్దును భద్రతా కారణాల దృష్ట్యా మూసివేసింది. అల్​ అసద్​ గద్దె దిగినప్పటి నుంచి ఇరాక్​ కు మద్ధతు నిలిచిపోయింది. దీంతో ఐసీస్​ పట్టు బిగిస్తుంది.