గుహలో ఉగ్రవాది మకాం!
కుంభమేళాపై దాడి ప్రయత్నం

భగ్నం చేసిన యూపీ పోలీసులు
విచారణలో వెలుగులోకి కీలక విషయాలు
లక్నో: మహాకుంభమేళాపై ఉగ్రదాడి ప్రయత్నానికి పాల్పడి విఫలమైన ఉగ్రవాది లాజర్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకొస్తున్నాయి. ఆదివారం మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం అతను ఫిబ్రవరి 14 నుంచి కుంభమేళా ప్రాంతానికి కేవలం ఒక కిలోమీటరు దూరంలోనే ఒక గుహను రూపొందించుకొని ఉన్నాడు. బాంబ్లస్ట్ చేయాలని గ్రేనెడ్లు కూడా వెంటబెట్టుకున్నాడు. పలుమార్లు ప్రయత్నించాడు. కానీ హై సెక్యూరిటీ ఉండటంతో ఇతని ప్రయత్నం ఫలించలేదు. పోలీసులు ఇతన్ని విచారించి సంఘటనా స్థలాన్ని పరిశీలించాక ఇతను చెప్పింది నిజమేనని నిర్ధరించారు. అతను చిన్నపాటి గుహలో తినేందుకు ఉపయోగించుకున్న కంచాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు లాజర్ ను మార్చి 6న కౌశాంబిలో అరెస్టు చేశారు. ఇతను అమృత్ సర్ లోని కుర్లియాన్ నివాసి బీకేఐ జర్మన్ మాడ్యుల్ స్వర్ణసింగ్ కు రైట్ హ్యాండ్ అని పోలీసులు తెలిపారు. ఇతనికి పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నాన్నారు.