బోస్​ ఫౌండేషన్​ ఆస్తులు నెహ్రూ వశం?

Are the assets of the Bose Foundation owned by Nehru?

Mar 15, 2025 - 11:04
 0
బోస్​ ఫౌండేషన్​ ఆస్తులు నెహ్రూ వశం?

ఆదేశాల మేరకు నిధులు హస్తగతం
రామమూర్తి, అయ్యర్​ కీలకపాత్ర
అనేక నివేదికలు, పుస్తకాల్లో స్పష్టమైన ఆధారాలు

 తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఆజాద్​ హింద్​ ఫౌజ్​ నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ కు సంబంధించిన నిధుల దుర్వినియోగం అంశం మరోమారు తెరపైకి వస్తుంది. 1951 నుంచి 1955 మధ్య భారత్​–జపాన్​ మధ్య జరిగిన చర్చల్లో అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఈ నిధులను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలున్నాయి. హింద్​ ఫౌజ్​ నిధులు ఏడు లక్షల డాలర్లు. వీటి దుర్వినియోగంపై అనుజ్​ ధార్​ 2012లో ‘ఇండియాస్​ బిగ్గెస్ట్​ కవర్​ అప్​’ పుస్తకంలో కీలక విషయాలను రాశారు. అంతేగాక నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అయ్యర్​ పంచవర్ష ప్రణాళికలో సలహాదారుగా నెహ్రూ నియమించారు. ఈ విషయాన్ని నేషనల్​ ఆర్కైవ్స్​ రహస్య ఫైళ్లు కూడా వెల్లడిస్తున్నాయి. నేతాజీకి అత్యంత దగ్గరి సహచరులైన రామమూర్తి​, అయ్యర్​ లపై నిధుల దుర్వినియోగంపై అనేక ఆరోపణలున్నాయి. నేతాజీ ఫౌండేషన్​ వద్ద ఉన్న ఆస్తులే గాక ఆయన సొంత ఆస్తులు కూడా భారీ మొత్తంలో ఆయన మరణం తరువాత దుర్వినియోగం, కనబడకుండా పోయాయి. 

1951లో జపాన్​ ప్రభుత్వం అందించిన రహాస్య సమాచారం గురించి కొందరు బయటపెట్టారు. బోస్​ వద్ద పెద్ద మొత్తంలో బంగారం, వజ్రాలు, రత్నాలు ఉన్నాయి. కానీ ఆయన జపాన్​ వెళ్లేటప్పుడు విమానంలో కేవలం రెండు సూట్​ కేసులను మాత్రమే అనుమతించారు. ఆ విమానంలో ప్రయాణిస్తూనే బోస్​ ప్రమాదానికి గురయ్యారు. నేతాజీ నిధి అంతా అయ్యర్​ గదిలో భారీ పెట్టెల్లో ఉండేదని ప్రస్తావించారు. నేతాజీ మరణం తరువాత ఫౌండేషన్​ నిధులపై విచారణ జరగ్గా కేవలం 300 గ్రాముల బంగారం, రూ. 260 నగదు మాత్రమే లభించింది. మిగతా భారీ నిధి ఏమైందనేది ఇప్పటికీ మిస్టరీగానే మారిందని 1955 నివేదికలో పేర్కొన్నారు. ఈ అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రతీ విషయం ప్రధాని నెహ్రూకు తెలుసని కూడా ఆయన ఆదేశాలతోనే నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలను కూడా ఈ నివేదిక చేసింది. ఆ తరువాత అయ్యర్​, రామమూర్తిలో బాగా అభివృద్ధి చెందారు. ఢిల్లీకి వచ్చిన అయ్యర్​ ను నెహ్రూ స్వాగతించారు. 1953 పంచవర్ష ప్రణాళిక కార్యక్రమానికి ప్రచార సలహాదారుగా కూడా నియమించారు.

ఏది ఏమైనా ఇప్పటికీ ఈ ఆస్తులు ఏమయ్యాయనే దానిపై విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ స్పష్టంగా అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఆదేశాల మేరకే ప్రతీది జరిగినట్లు అనుమానాలున్నాయి. నేతాజీ ఫౌండేషన్​ ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలనే డిమాండ్​ వినిపిస్తుంది.