25కిలోల ఐఈడీ నిర్వీర్యం

25kg IED defused

Feb 2, 2025 - 18:48
 0
25కిలోల ఐఈడీ నిర్వీర్యం

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ లోని బీజాపూర్​ జిల్లా ఉసుర్​ అవాపల్లి ప్రధాన రహదారి ధన్​ మండి సమీపంలోని రహదారిపై నక్సల్స్​ అమర్చిన 25 కిలోల ఐఈడీని భద్రతా దళాలు ఆదివారం నిర్వీర్యం చేశాయి. ఇంప్రూవైజ్డ్​ ఎక్స్​ ప్లోజివ్​ డివైజ్​ (ఐఈడీని) భద్రతా దళాలు, పోలీసులే లక్ష్యంగా పెట్టినట్లుగా అధికారులు తెలిపారు. ఇటీవల జరుగుతున్న వరుస కూంబింగ్​, ఎన్​ కౌంటర్​ నేపథ్యంలో బీజాపూర్​ జిల్లా వ్యాప్తంగా అనువణువునా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే భద్రతా దళాలు కూంబింగ్​ నిర్వహిస్తున్న, నిర్వహించే ప్రాంతాల్లో భారీ ఎత్తున ఐఈడీలు లభ్యమవుతున్నాయని తెలిపారు. వీటిని ఉపయోగించుకునే భద్రతా దళాలపై భారీ దాడులకు నక్సల్స్​ పాల్పడుతున్నారనే సమాచారం తమ వద్ద ఉందన్నారు.