అమెరికాలో ఘోర విమాన ప్రమాదం
సహాయక చర్యలతో తప్పిన ప్రాణాపాయం

వాషింగ్టన్: అమెరికా డెన్వర్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు సహాయక చర్యల వేగవంతంతో ఎంతోమందికి ప్రాణాపాయం తప్పింది. ఎయిర్ లైన్స్ బోయింగ్ 737---–800 విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఈ విమానంలో 172 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా దానిని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఈ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం కొలరాడో స్ప్రింగ్స్ విమానాశ్రయం నుంచి బయలుదేరి డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ విమానం ఇంజిన్ లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రయాణికులందరినీ సురక్షితంగా ఖాళీ చేసి టెర్మినల్‌కు పంపించారు.