స్మగ్లర్లపై ‘పుష్ప’ ఎఫెక్ట్!
బిహార్ లో అక్రమ మద్యం పట్టివేత

పాట్నా: ‘పుష్ప’ సినిమా వచ్చాక స్మగ్లర్లు తెలివి మీరారో? లేక స్మగ్లర్ల తెలివిని చూసే ఈ సినిమా తీశారో? తెలియదు గానీ ఈ మధ్య స్మగ్లర్లు అచ్చం పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేసిన తరహాలోనే అక్రమ సరఫరాలకు పాల్పడుతున్నారు. ఆదివారం వేకువజామున బిహార్ లో భారీ ఎత్తున పెట్రోల్ ట్యాంకులో అక్రమ మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. త్వరలోనే హోలీ వేడుకలు సమీపిస్తున్న దృష్ట్యా స్మగ్లర్లు ఈ విదేశీ మద్యాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న సిండికెట్లకే ముట్టజెప్పి భారీ డబ్బు మూటగట్టుకోనున్నారు. కాగా పెట్రోల్ ట్యాంకులో విదేశీ మద్యం సరఫరా అవుతున్న విషయంపై పోలీసులు పక్కా సమాచారం అందుకొని నిఘా పెట్టారు. దీంతో స్మగ్లర్లు పెట్రోల్ ట్యాంకులోపల విదేశీ మద్యం బాటిల్లను నిల్వ చేసిన తీరును చూసి ఆశ్చర్యపోయి, స్వాధీనం చేసుకున్నారు.