గ్రీన్ లాండ్ స్వాధీనం తథ్యం: ట్రంప్!
Fact of Greenland acquisition: Trump!

వాషింగ్టన్: గ్రీన్ లాండ్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు పునరుద్ఘాటించారు. నాటో చీఫ్ సెక్రెటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఈ భూభాగం డెన్మార్క్ లో స్వయం ప్రతిపత్తి భూభాగంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డెన్మార్క్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడంలో నాటూ కీలక పాత్ర పోషించనుందన్నారు. కాగా ఈ విషయంలో నాటోను లాగడం తగదని రుట్టే పేర్కొనడం గమనార్హం. గ్రీన్ లాండ్ లో ఇప్పటికే అమెరికా సైనిక స్థావరాన్ని కలిగి ఉందన్నారు. 200 ఏళ్ల క్రితం నుంచి తమకు హక్కులు ఉంటాయని వాదించడం విచారకరమని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇక నుంచి అక్కడికి వెళ్లేఅ అమెరికా సైనికుల సంఖ్య మరింత పెరగొచ్చన్నారు. డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్ ట్రంప్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే గ్రీన్ లాండ్ భవిష్యత్తును ఆ దేశ ప్రజలకు మాత్రమే నిర్ణయించుకోవాల్సిన హక్కు ఉందన్నారు.