ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలి
ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ ఓం బిర్లా సమావేశం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్, రాజ్యసభ ఉభయ సభల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. సోమవారం మధ్యాహ్నం వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్ లతో మధ్యాహ్నం పార్లమెంట్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ గౌరవ్ గోగొయ్, టీఎంసీ కళ్యాణ్ బెనర్జీ, టీడీపీ కృష్ణదేవరాయలు, డీఎంకే టీఆర్ బాలు, ఎన్సీపీ సుప్రియా సూలే, ఎస్పీ ధర్మేంద్ర యాదవ్, జేడీ(యూ) దిలేశ్వర్ కమేయిట్, ఆర్జేడీ అభయ్ కుశ్వాహ్, యూబీటీ శివసేన అరవింద్ సావంత్, కె. రాధాకృష్ణన్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ప్రజా సమస్యల వేదికపై అందరం హుందాగా, గౌరవంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశాలు నిర్వహించే, చర్చ జరిగే పద్ధతులను ప్రజలు అనుక్షణం వీక్షిస్తున్నారని మరువరాదన్నారు. అదే సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికపై ప్రతిపక్షాల సమస్యలను కూడా చర్చిస్తామని ప్రతిపక్షాలకు తెలిపారు. ఓపికగా సభను సజావుగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.