448 మిలియన్ డాలర్లకు సేంద్రీయ ఆహార ఉత్పత్తుల ఎగుమతి
పార్లమెంట్ కు కేంద్రమంత్రి బిట్టు లిఖితపూర్వక సమాధానం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ సేంద్రీయ ఆహార ఉత్పత్తుల ఎగుమతి 448 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గతేడాది కంటే ఎక్కువని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి నవనీత్ సింగ్ బిట్టు లోక్ సభకు సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ యేడాది నవంబర్ నాటికి 2,63,050 మెట్రిక్ టన్నుల సేంద్రీయ ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేశామన్నారు. మంత్రిత్వ శాఖ నిధులను కేటాయించినప్పటికీ, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (ఏపీఈడీఎ) ఎగుమతిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. ఎన్ పీవోపీ (నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గాని ప్రొడక్షన్) అక్రిడిటేషన్, సేంద్రీయ ఉత్పత్తి ప్రమాణాలు, అభివృద్ధి, మార్కెటింగ్ ను ప్రోత్సహించడం వంటివి పటిష్టం చేశారు. ఈ కార్యక్రమం కింద భారత్ లో 1,016 ఆర్గానిక్ సర్టిఫైడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. ఏపీఈడీఎ సేంద్రీయ ఉత్పత్తుల్లో గ్లోబల్ రిటైల్ చైన్ లులు గ్రూప్ ఇంటర్నేషనల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వల్ల ఎఫ్ పీవోలు, ఎఫ్ పీసీలు, సహకార సంఘాలను గ్లోబల్ మార్కెట్ తో నేరుగా అనుసంధానం చేయడంతోపాటు నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
సేంద్రీయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కీలక సరఫరాదారుగా భారతదేశం తన పాత్రను మంత్రి బిట్టు చెప్పారు. ఈ ప్రయత్నాలు దేశం వ్యవసాయ ఎగుమతి స్థావరాన్ని మరింత పటిష్టం చేయడానికి భావిస్తున్నట్లు పేర్కొన్నారు.