- కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి
- 10 కోట్లమందికి ఉచితంగా సిలిండర్ కనెక్షన్లు
- తెలంగాణలో 15 లక్షల మందికి
- 30కోట్ల మందికి ఉచిత రీఫిల్స్
- సబ్సిడీ వదులుకున్న వారికి అభినందనలు
- తెలంగాణలో 90 శాతం ఇళ్లలో సిలీండర్లు
- గ్యాస్ బుకింగ్ లో మరింత సాంకేతికత వాడాలి
- ఎల్పీజీ డిస్ర్టిబ్యూటర్స్ సమ్మిట్ 2024లో కేంద్రమంత్రి
నా తెలంగాణ, హైదరాబాద్: అక్కాచెల్లెమ్మలకు పొగ నుంచి విముక్తి కల్పించే బృహత్తర సంస్థ ప్రధాని నరేంద్ర మోదీ ఆరంభించి అర్హులైన ప్రతీ ఒక్కరి ఇంట్లో ఎల్పీగ్యాస్ ను అందజేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మహిళలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మంది ఈ కార్యక్రమం ద్వారా దేశంలో అనేక మంది నిరుపేదలు పొందారని. ఆదివారం సికింద్రాబాద్ సిక్ విలేజ్ గాయత్రీ గార్డెన్ ఎల్పీజీ డిస్ర్టిబ్యూటర్స్ సమ్మిట్ 2024లో పాల్గొని ప్రసంగించారు.
ప్రజలందరికీ దీపావళి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్కా చెల్లెళ్ల కళ్లలో నీరు రావొద్దనే లక్ష్యంతో ఉజ్వల యోజనను తీసుకొచ్చారు. ఇప్పటివరకు 10 కోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా సిలిండర్ కనెక్షన్లు ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో 15 లక్షలపైగా మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని తెలిపారు. ఆ సమయంలో పిఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద 30 కోట్ల మందికి ఉచితంగా ఎల్పీజీ రీఫిల్స్ ఇచ్చామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు.
ఎల్సీజీ సహాయాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న వారిని అభినందించారు. వారికి ధన్యవాదాలు. డబ్బులున్న వారు పేదల కోసం ఇలాంటి సహాయం చేస్తేనే భారత్ బలమైన అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించుకోగలదన్నారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల పనితీరు అభినందనీయమన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 90 శాతం ఇళ్లలో ఎల్పీజీ సిలీండర్లున్నాయని తెలిపారు.
సిలిండర్ బుక్ చేసుకోవడం, డెలివరీని ట్రాకింగ్ చేయడం, బిల్ పేమెంట్ చేయడం వంటివి కూడా అడ్వాన్స్ టెక్నాలజీని వాడాలన్నారు. రానున్న 25ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచదేశాల సరసన నిలవాలంటే 140 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. యువశక్తిని వాడుకొని ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలబడతామని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.