2025లోనూ భానుడి ప్రకోపం!
Bhanu's anger in 2025!

చలిరోజులు తగ్గుదల, పెరుగుతున్న వేడి
హీట్ వేవ్ లపై యూఎన్ హెచ్చరికలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: 2025లో ఎండాకాలంలో సూర్యుడి (భానుడి) ప్రకోపం కొనసాగనుంది. ఎండలు మండిపోనున్నాయి. 1901 నుంచి వాతావరణాన్ని పోల్చుకుంటే చలిరోజులు తగ్గుతూ, వేసవిరోజుల్లో పెరుగుదల చోటు చేసుకుంటున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. చలికాలం 41 రోజుల్లో కూడా వేడి (హీట్ వేవ్స్) నమోదవుతున్నాయన్నారు. చలికాలంలో 1901 కనిష్ట ఉష్ణోగ్రతను పోల్చుకుంటే 0.90 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2024లో ఉష్ణోగ్రత 25.74 డి.సె, ఇది వార్షిక సగటు కంటే 0.65 శాతం ఎక్కువ. 2024లో భారత్ లోనే గాకుండా ప్రపంచదేశాల్లో కూడా అత్యంత వేడి నమోదవుతుందని యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ స్పష్టం చేసింది. భూమి సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుంది. ఇది 2024లో 41 రోజులపాటు ప్రమాదకరమైన హీట్ వేవ్ లు కొనసాగాయి. 2025లోనూ ఇదే పరిస్థితులు కొనసాగనున్నాయని యూఎన్ (ఐక్యరాజ్యసమితి) కూడా తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే ప్రపంచ వాతావరణ మార్పు, చేర్పులకు కారణంగా నిలుస్తుంది.
వాతావరణ మార్పుల వల్ల మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారీ వరదలు, వేడిగాలులు, అత్యధిక చలి లాంటివే గాకు అగ్నిప్రమాదాలు, విపరీతంగా మంచు కురవడం, వర్షాలు కురవడంతో వరదలు రావడం వంటి విపరీత కారణాలకు గ్లోబల్ వార్మింగ్ కారణంగా యూఎస్ స్పష్టం చేసింది. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్ లో మానవాళి మనుగడకు పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణంలో సమతుల్యతను పాటించేందుకు ప్రపంచంలోని దేశాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2024లో వేడిగాలుల కారణంగా 3,700 ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇదే సమయంలో 2024లో ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు వేగవంతంగా ఉండడం పట్ల యూఎన్ మేలుకొలుపుగా అభివర్ణించింది.