ఆప్​ నేతలపై చర్యలకు ఎల్జీ ఆమోదం!

LG approves action against AAP leaders!

Mar 13, 2025 - 18:45
 0
ఆప్​ నేతలపై చర్యలకు ఎల్జీ ఆమోదం!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్​ నాయకులు మనీష్​ సిసోడియా, సత్యేంద్రజైన్​ లకు మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. గురువారం అవినీతి కేసులో తదుపరి చర్యలకు ఢిల్లీ ఎల్జీ అనుమతులకు ఆమోదం తెలిపారు. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లి బెయిల్​ పై బయటికి వచ్చిన మనీష్​ సిసోడియాపై విద్యకు సంబంధించిన అవినీతిలో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్​ డైరెక్టరేట్​, అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్​ 17 కింద అనుమతులు కోరారు. అదే విధంగా సత్యేంద్ర జైన్​ మాజీ పీడబ్ల్యూడీ మంత్రిపై కూడా చర్యలకు అనుమతి కోరగా ఎల్జీ ఆమోదించారు. ఇప్పటికే మద్యం అవినీతి కేసులో కూడా వీరు నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు మరిన్ని కేసుల్లో చర్యలకు అనుమతించడంతో వీరిద్దరిపై ఇతర అవినీతి అంశాలపై కూడా దర్యాప్తు ఊపందుకోనుంది.