బీజేపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం?

Assassination attempt on BJP MLA?

Jan 2, 2025 - 15:31
 0
బీజేపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం?

నిందితులను వెతికే పనిలో పోలీసులు

లక్నో: యూపీ లఖింపూర్​ బీజేపీ ఎమ్మెల్యే సౌరభ్​ సింగ్​ పై హత్యాయత్నం జరిగిందనే విషయం పెను సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే ఇంటిబయట కాల్పులు జరిగాయి. ఎమ్మెల్యేపైనే నిందితులు కాల్పులకు తెగబడేందుకు వచ్చారనే అనుమానాలను బీజేపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్నారు. సౌరభ్​ ఇంటి బయట బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తచ్చాడుతుండగా విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే వారిని ప్రశ్నించారు. ఈ సమయంలో సౌరభ్​ సింగ్​ నిందితుల నుంచి దూరాన్ని పాటించారు. దీంతో నిందితులు గాలిలోకి కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఎమ్మెల్యే మద్ధతు దారులు పెద్ద యెత్తున ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా పారిపోయారు. ఈ కాల్పుల ఘటనపై కొత్వాలి పోలీసులు విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే ఇంటి పరిసరాల్లో భద్రతను పెంచారు. నిందితులు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు కొత్వాల్​ అంబర్​ సింగ్​ తెలిపారు.