సిద్ధిధాత్రి అవతారంలో బాసర అమ్మవారు
Basara Amma in Siddhidhatri avatar
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శ్రీ శారదీయ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవ రోజు శుక్రవారం అమ్మవారు సిద్ధిధాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద యెత్తున భక్తులు తరలివస్తున్నారు. ఆలయ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.