అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో నిందితులకు బెయిల్

 కండిషనల్ బెయిల్ మంజూరు

May 3, 2024 - 16:30
 0
అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో నిందితులకు బెయిల్

నా తెలంగాణ, హైదరాబాద్​: అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీ పీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ ఏ1, మన్నె సతీష్ ఏ2, నవీన్ఏ3, ఆస్మా తస్లీమ్ ఏ4, గీత ఏ5లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.   నాంపల్లి కోర్టులో శుక్రవారం బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు..  కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. నగదు షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిందితులు ప్రతీ సోమ, శుక్రవారాలు విచారణ అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించింది