తెలంగాణలో బీజేపీ వేవ్​ – కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సోదిలో కూడా లేవు

మోదీ – రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కీలక అంశాలు చర్చించాను – తన ఇంటర్వ్యూ చూడాలని ‘ఎక్స్’లో కోరిన ప్రధాని

May 10, 2024 - 16:18
 0
తెలంగాణలో బీజేపీ వేవ్​ – కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సోదిలో కూడా లేవు

నా తెలంగాణ, హైదరాబాద్​: తెలంగాణలో బీజేపీ వేవ్​ ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రంలో కమలం పార్టీకి అనుకూల వాతావరణం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్​ఎస్​ పార్టీలో కనీసం సోదిలో కూడా లేవని మోదీ గుర్తు చేశారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, జాతీయ రాజకీయాలపై ఓ తెలుగు టీవీ చానెల్​ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఇంటర్వ్యూ చూడాలని ఈ సందర్భంగా మోదీ ఎక్స్​ లో పిలుపునిచ్చారు. 

రెండు చోట్ల మోదీ సభలు

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. మహబూబ్​ నగర్​, నాగర్​ కర్నూల్​, నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా నారాయాణపేటలో నిర్వహించే సభలో కూడా మోదీ పాల్గొంటున్నారు. ఈ రెండు సభలతో తెలంగాణలో  మోదీ ప్రచారం పూర్తవుతుందని బీజేపీ నాయకులు తెలిపారు. రేపు చివరి పార్టీ కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నది.