బహ్రెచ్​ హింస.. గోపాల్​ హత్య.. నేపాల్​ పారిపోయిన నిందితులు?

పోస్టుమార్టంలో విస్తుగొలిపే విషయాలు వెల్లడి ఫోటోలు, వీడియోలు బహిర్గతం

Oct 16, 2024 - 14:47
 0
బహ్రెచ్​ హింస.. గోపాల్​ హత్య.. నేపాల్​ పారిపోయిన నిందితులు?

లక్నో: బహ్రెచ్​ గోపాల్ మిశ్రా హత్య కేసులో ప్రధాన నిందితుడి అబ్దుల్​ హమీద్​ కుటుంబం నేపాల్​ కు పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం గోపాల్​ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు, వీడియోలు వెలుగు చూశాయి. గోపాల్​ మిశ్రా ఆకుపచ్చ జెండాను తీసివేసి కాషాయ జెండా ఎగురవేశాడు. దీంతో కోపోద్రిక్తులైన అబ్దుల్​ హమీద్​ కుటుంబం అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్లి తీవ్రంగా హింసింది. గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అంతేగాక అతని శరీరంపై తీవ్ర గాయాలున్నట్లు వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. అతని శరీరంలో 15 బుల్లెట్లను కాల్చినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడించారు. 

దసరా అమ్మవారి నిమజ్జన వేడుకల సందర్భంగా రాళ్ల దాడి జరిగింది. దీంతో బహ్రెచ్​ లో ఎప్పుడూ లేనంతగా భారీ హింస చోటు చేసుకుంది. ఈ హింసపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ యోగి సీరియస్​ అయ్యారు. ఏ ఒక్కరిని వదలొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.