కాంగ్రెస్ హామీలన్నీ అమలు చేస్తే.. నేను దేనికంటే దానికి సిద్ధం: ఈటల
BJP leader Etala accused the Congress party of cheating by giving promises
నా తెలంగాణ, హైదరాబాద్: బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మొన్నటి వరకు అన్నింటిలో నంబర్ వన్ అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన దిక్కులేరు. మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని, బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే దేనికంటే దానికి సిద్ధమని సవాల్ విసిరారు. డబ్బు, మద్యాన్ని పాతర వేసి.. ధర్మాన్ని గెలిపించండి అని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచదర్ రావు, ఆర్కే శ్రీనివాస్, గోలీమధుసుదన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.