పోడు భూములపై ఇరు గిరిజన వర్గాల గలాట
ఆపేందుకు వచ్చిన పోలీసులపై దాడి పలువురికి గాయాలు
ఖమ్మం: పోడుభూములపై ఇరుగిరిజన వర్గాల మధ్య జరుగుతున్న గొడవను సద్దుమణిగింప చేద్దామనుకున్న పోలీసులపై దాడి జరిగింది. ఓ గిరిజన వర్గంలో రాళ్లు, కర్రలతో దాడులను నిరోధించేందుకు వచ్చిన పోలీసులపై మూకుమ్మడి దాడికి పాల్పడింది. ఆదివారం ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో పోడుభూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణ సమాచారం పోలీసులకు అందింది. హుటాహుటీన తన టీమ్‌తో కలిసి సత్తుపల్లి సీఐ కిరణ్ బయలుదేరారు. గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి విషయం ఏంటో ఆరా తీసేందుకు, నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన ఓ వర్గం గిరిజనులు ఉన్నఫళంగా పోలీసులపై దాడికి పాల్పడడంతో పోలీసులు తప్పించుకున్నారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.