ఈవీఎంలపై ఆరోపణలు సరికాదు

ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే

Dec 26, 2024 - 18:07
 0
ఈవీఎంలపై ఆరోపణలు సరికాదు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఈవీఎం ట్యాంపరింగ్​ పై పక్కా ఆధారాలు ఉంటే తప్ప ఆరోపణలు చేయడం సరికాదని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మీడియాతో ఈవీఎం ఆరోపణలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేకుండా నిందించడం సరికాదన్నారు. ధృఢమైన, విశ్వసనీయమైన ఆధారాలు ఉంటే ఆరోపణలను సమర్థిస్తానన్నారు. తాను నాలుగుసార్లు కూడా ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే గెలుపొందానని స్పష్టం చేశారు. కాగా ఈవీఎం ట్యాంపరింగ్​ పై బీజేడీ, ఆప్​ లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నాయన్నారు. వారి వద్ద ఎలాంటి ఆధారాలున్నాయనే విషయం తనకు తెలియదన్నారు. ఓటర్ల పేర్లను తొలగించడం, చేర్చడంపైనే ఆప్​ కేజ్రీవాల్​ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. ఈ విషయాలపై చర్చ లేకుండా సమాధానం చెప్పలేనన్నారు.