నన్ను తప్పించండి.. ఓటమికి తనదే బాధ్యత
ఖార్గేకు మహా కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే లేఖ
ముంబాయి: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమికి తనదే బాధ్యత అని తన ప్రయత్నం నెరవేరలేదని తనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి విముక్తిన్ని చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. శుక్రవారం ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. మహారాష్ట్రలో 101 స్థానాల్లో పోటీ చేసినా, కేవలం 16 స్థానాలను మాత్రమే గెలిచింది. ఓటమికి నానా పటోలే బాధ్యత వహించారు. రాష్ట్రంలోని పలువురు అగ్రనేతలను కూడా ప్రజలు తిరస్కరించారు. భండారా జిల్లాలోని సకోలి అసెంబ్లీ స్థానం నుంచి నానా పటోలే విజయం సాధించినా చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా కేవలం 208 ఓట్ల తేడాతో గెలుపొందారు.