హిందువులపై దాడులు శోచనీయం
ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్
నాగ్ పూర్: ఎటువంటి కారణం లేకుండానే హిందువులపై బంగ్లాదేశ్ లో దాడులు జరగడం శోచనీయమని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగ్ పూర్ లోని సంఘ్ ప్రధాన కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు. అనంతరం ప్రసంగించారు. అక్కడి హిందూవులపై దాడులు పథకం ప్రకారమే జరుగుతున్నాయన్నారు. ప్రజలు, మైనార్టీల స్వేచ్ఛను రక్షించడం ప్రతీ ఒక దేశం బాధ్యత అన్నారు. హిందువులలో ఎవ్వరిపైనా దాడికి పాల్పడే సంస్కృతి లేదన్నారు. తోటివారికి సాయం చేయడమే తమ దేశం తమకు నేర్పని పాఠమన్నారు. అరాచకాలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సాయం అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందువులు, మైనార్టీలపై దాడులతో ఆ దేశంలో అస్థిరత తిరిగి నెలకొనే ప్రమాదం లేకపోలేదని మోహన్ భగవత్ అన్నారు.