సుడాన్​ ఆసుపత్రిపై దాడి..70మంది మృతి

Attack on Sudan hospital.. 70 people killed

Jan 26, 2025 - 13:31
 0
సుడాన్​ ఆసుపత్రిపై దాడి..70మంది మృతి

కార్టూమ్​: సుడాన్​ లోని డార్ఫర్​ ప్రాంతంలో ఆసుపత్రిలో జరిగిన దాడిలో 70 మంది మరణించారని డబ్ల్యూహెచ్​ ఓ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనామ్​ ఘెబ్రేయేసస్​ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం దాడి, మృతి విషయాన్ని సామాజిక మాధ్యమంగా పంచుకున్నారు. అల్​ ఫాషర్​ నగరంలో ఈ దాడి జరిగిందని పూర్తి సమాచారం ఉందన్నారు. మరణాల సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని తెలిపారు. సుడాన్​ లోని ఆసుపత్రిపై జరిగిన దాడిలో 19మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. దాడి ఎవరు చేశారనేది తెలియరాలేదని, స్థానిక అధికారుల ప్రకటనలను బట్టి తిరుగుబాటు ర్యాపిడ్​ సపోర్ట్​ ఫోర్స్​ (ఆర్​ఎస్​ఎఫ్​) కారణమని తెలుస్తుందన్నారు. దాడికి ముందు ఆసుపత్రిలో చాలామంది రోగులు చికిత్స పొందుతున్నారని, అదే సమయంలో ఈ దాడి జరిగిందని దీంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉండడం బాధాకరమని అధనామ్​ పేర్కొన్నారు.