కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

రెండు కోట్ల మంది పుణ్యస్నానాలాచరిస్తారని అంచనా

Jan 26, 2025 - 13:19
 0
కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

లక్నో: మహాకుంభమేళా 14వ రోజు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీ ఎత్తున భక్తులు సందర్శన, పుణ్య స్నానాలకు పోటెత్తారు. దీంతో ప్రయాగ్​ రాజ్​, హరిద్వార్​, ఉజ్జయిని, నాసిక్​ వద్ద త్రివేణి సంగమ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 10 గంటల వరకే 37 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రెండు కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి పుణ్యస్నానాలకు 20 నుంచి 25 లక్షల మంది రావడంతో ఆయా స్నాన ఘట్టాల వద్ద అధికారులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. విడతల వారీగా భక్తులను అనుమతిస్తున్నారు. ఇక ఆయా ప్రాంతాల్లోని స్నాన ఘట్టాలకు దగ్గరగా ఉన్న ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంది. ప్రైవేట్​ వాహనాలను 10, 12 కి.మీ. ముందే నిలిపివేస్తున్నారు. ప్రభుత్వ వాహనాలను ఐదు కి.మీ. దూరంలో నిలిపి వేస్తున్నారు. దీంతో ప్రయాగ్​ రాజ్​ కు దారి తీసే 56 కి.మీ. పొడవునా వాహనాలు బారులు తీరినట్లు అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా సోమవారం సాయంత్రం ప్రయాగ్​ రాజ్​ లో పుణ్య స్నానం ఆచరిస్తారు.