అమెరికా–భారత్ నూతన శిఖరాలను అధిరోహిస్తాం
America-India will climb new heights
దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో
వాషింగ్టన్: అమెరికా–భారత్ మధ్య భాగస్వామ్యం నిరంతరం నూతన శిఖరాలను అధిరోహించాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల మధ్య 21వ శతాబ్ధపు బంధాలు మరింత పటిష్ఠమవుతాయని ఆకాంక్షించారు. న్యూ ఢిల్లీలో భారత తన సైనిక సత్తాను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం హర్షణీయమన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పునాదిగా భారత్ నిలుస్తుందన్నారు. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చేది భారతదేశమేనని రూబియో చెప్పారు. రెండుదేశాల ప్రజల మధ్య శాశ్వతమైన స్నేహ సంబంధాలు ఇరుదేశాల సహకారానికి పునాది వంటివని, ఆర్థికంగా కూడా అద్భుతంగా సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లడంలో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలో ఉమ్మడి సహకారం, ఇండోపసిఫిక్ క్వాడ్ లో తమవంతు సహకారం అందిస్తామని మార్కో రూబియో స్పష్టం చేశారు.