26/11 దాడుల సూత్రధారి భారత్ కు
India is the mastermind of 26/11 attacks
అమెరికా కోర్టు ఆమోదం
దౌత్యప్రక్రియ మొదలు
దాడుల బ్లూప్రింట్ సిద్ధం చేసింది రాణానే
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ముంబాయి 26/11 ఉగ్రదాడుల బ్లూప్రింట్ ను సిద్ధం చేసిన తహవ్వూర్ రాణాను భారత్ తీసుకురానున్నారు. అమెరికా కోర్టులో అతనికి వ్యతిరేకంగా భారత్ బలమైన సాక్ష్యాలు సమర్పించింది. దీంతో రాణాను భారత్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇక దౌత్య ప్రక్రియ మొదలు పెట్టి త్వరలోనే అతన్ని భారత్ తీసుకువచ్చి విచారించనున్నారు. అమెరికా కోర్టు ఆమోదం తెలిపింది. రాణాను అప్పగించొద్దన్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. పాక్ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాలో రాణా క్రియాశీల సభ్యుడని బలమైన సాక్ష్యాలను ముంబాయి పోలీసులు చార్జీషీట్ లో సమర్పించారు. ప్రధాన సూత్రధారి డేవిడ్ కోల్ మన్ హెడ్లీకి తహవ్వూర్ రాణా సహాయం చేశాడు. అయితే భారత్–అమెరికాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితుడి ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలు సమర్పిస్తే వారిని ఇరుదేశాలు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. రాణాను ఎఫ్ బీఐ చికాగోలో అరెస్టు చేసింది. ఇతను ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ జైలులో ఉన్నాడు.