ఇస్రో మరో చరిత్ర.. డాకింగ్ సక్సెస్
విజయవంతంగా భూకక్ష్యలోకి ఉపగ్రహాలు
శ్రీహరికోట: ఇస్రో డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసి నూతన చరిత్ర సృష్టించింది. స్పాడెక్స్ రెండు ఉపగ్రహాలను విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు గురువారం ఇస్రో ప్రకటించింది. దీంతో ఇస్రో అమెరికా, రష్యా, చైనాల తరువాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.
ఇస్రో 30 డిసెంబర్ 2024న రాత్రి 10 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్‌ను ప్రారంభించింది. ఇందులోభాగంగా పీఎస్ఎల్వీ-సీ60 రాకెట్‌తో భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో రెండు అంతరిక్ష నౌకలను మోహరించారు.
రెండు వ్యోమనౌకలను జనవరి 7న ఈ మిషన్‌లో అనుసంధానం చేయాల్సి ఉంది. కానీ అది వాయిదా పడింది. ఆ తర్వాత జనవరి 9న కూడా సాంకేతిక సమస్యల కారణంగా డాకింగ్ ప్రక్రియను వాయిదా వేశారు. జనవరి 12న అంతరిక్ష నౌకలను 3 మీటర్లకు దగ్గరగా తీసుకువచ్చిన తర్వాత, వాటిని తిరిగి సురక్షితమైన దూరానికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు.