సింగపూర్​ అధ్యక్షుడికి ఘన స్వాగతం

రాష్ట్రపతి, ప్రధానితో భేటీ

Jan 16, 2025 - 13:18
 0
సింగపూర్​ అధ్యక్షుడికి ఘన స్వాగతం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​–సింగపూర్​ మధ్య దౌత్యబంధాలు మరింత బలపడాలని అధ్యక్షుడు ధర్మన్​ షణ్ముగరత్నం అన్నారు. ఇరుదేశాల మధ్య దౌత్యబంధాలు 60ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం భారత పర్యటనకు వచ్చిన ధర్మన్​, ఆయన సతీమణి జేన్​ యుమికోలకు ఘన స్వాగతం లభించింది. అనంతరం అధ్యక్షుడు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీలను కలిశారు. ఈ సందర్భంగా సింగపూర్​ అధ్యక్షుడు ధర్మన్​ షణ్ముగరత్నం మాట్లాడుతూ.. ఎన్నో దేశాలతో దౌత్యబంధాలు, వ్యాపార, వాణిజ్యాలున్నా భారత్​ ను ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. తమ దృష్టిలో భారత్​ తో బంధాల బలోపేతంతోపాటు బలమైన స్నేహబంధం ఉందన్నారు. పరస్పర నమ్మకాలు, విశ్వాసాలున్న మోదీ ప్రభుత్వంతో సంబంధాలను కొనసాగించడం సంతోషకరమన్నారు. భారత్​ లో అతిపెద్ద పెట్టుబడిదారుగా సింగపూర్​ కొనసాగుతుంది. ‘గిఫ్ట్ సిటీ, సింగపూర్ మధ్య డేటా కారిడార్’ ను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో భారత్​–సింగపూర్​ మధ్య సురక్షితమైన, భద్రతతో డేటా మార్పిడి చేసుకోవచ్చన్నారు. పునరుత్పాదక ఇంధనం కోసం కూడా కారిడార్​ ఏర్పాటు కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 

ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు అసోం, ఒడిశా లాంటి ఈశాన్య ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులను చేపట్టామని ఇందుకు భారత్​ సహకారం మరువలేనిదని ధర్మన్​ షణ్ముగం అన్నారు.